Daily Arcturian Healing MeditationPlease Join the Daily Meditation from 9.30 PM to 11.30 PM

వ్యాసాలువిశ్వ జ్ఞానం

ఈ ప్రపంచం అంతా భ్రమ…

ప్రజలు ఏది వినాలని కోరుకుంటారో అదే వినటానికి ఇష్ట పడతారు.

Hari Krishna4 నిమిషాలు
ఈ ప్రపంచం అంతా భ్రమ…

ప్రజలు ఏది వినాలని కోరుకుంటారో అదే వినటానికి ఇష్ట పడతారు. అది వారి నమ్మకాలకు  అనుగుణంగా ఉంటె చాలు లేదంటే అది చెడుగా ముద్ర వేస్తారు…ఇదే ద్వంద్వత్వం అంటే. అయితే ఇది కుడా భ్రమే, ఎందుకంటే ఈ ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయని మనం నమ్ముతాము, అది మనస్సు యొక్క నమ్మకం మాత్రమే. ఉన్నదంతా ఒక్కటే అదే బ్రహ్మాత్మ, అది వేరు వేరు మనస్సులను కలిగి ఉంది అని అర్ధం చేసుకోక పోవటమే ఆ నమ్మకానికి కారణం.

ప్రజలు భయంతో ఉంటారు ఎందుకంటే వారు, వారికీ సంబంధించింది ఏదైనా కోల్పోతారేమో అని…. కాని అది కూడా వారి భ్రమ మాత్రమె.  ఈ ప్రపంచం అంతా భ్రమ… ఎందుకంటే ఇది నిజమూ కాదు ఇందులో సత్యమూ లేదు. మీ నమ్మకాల వ్యవస్తకు అనుగుణంగా ఈ ప్రపంచం సృస్టించ బడింది..కేవలం మీ ద్వారానే సృష్టించబడింది…

మీరు  “భగవంతుని నుండి వేరు” అనే భావనే మిమ్మల్ని తప్పు చేశామనే ‘ఆత్మన్యూనతా’ భావనలో, భయం లో ఉంచుతుంది.

మీకు ఏదైనా "పీడకల" వచ్చినపుడు మీరు  భయ పడతారు, ఎందుకంటే ఆ సమయం లో మీరు దాన్ని నమ్మరు కాబట్టి…ఆ తర్వాత దాన్ని గుర్తించి అంటే నేను నా ఇంట్లో బెడ్ పై క్షేమంగా ఉన్నాను అని తెలుసుకొని  రిలాక్స్ అవుతారు అంటే క్షమించి వదిలేస్తారు అని అర్థం. అలాగే జీవితం కుడా అంతె ఇది ఒక ‘కల’.  నిజానికి మీరెప్పుడు దేవునితోనే  ఉన్నారు.

కలలో మీకు ఇది ‘కల’ అనే ఎరుక మీకు కలిగితే మీరు ఆ ‘కల’ను ఎంజాయ్ చేయవచ్చు…మేల్కున్న వారు అందరు ఇదే ప్రపంచం లో ఉంటారు కాని దీనితో సంబంధం లేకుండా జీవిస్తారు. పక్క వారికి మేల్కొనటం లో సహాయం చేస్తారు.

బైట జరిగే పరిస్తితులన్నీ కూడా మీ అంతరంలో ఉన్న అణిచిపెట్టబడిన నమ్మకాల ప్రసారాలే…మీలోనే మీ చేత గుర్తించబడని నమ్మకాలు బాహ్య ప్రపంచం లోకి ప్రసారం అయి, మీరు గుర్తించేలా చేసి మిమ్మల్ని మీరు సరీ చేసుకునేల సహాయ పడతాయి.

దీన్ని గుర్తించనివారు పరిస్తితులతో ఘర్షణ పడతారు…వీటినే కష్టాలు అంటారు. మీ చుట్టూ ఉన్న పరిస్తితులను మీవే  అని అంగీకరించి వాటిని క్షమించి వదిలేసినప్పుడు మీరు స్వేచ్చను పొందుతారు…ఇదే మిమ్మల్ని  మీరు సరిచేసుకోవటము అంటే. మన శత్రువులను, పరిస్తితులను, తిట్టుకున్నప్పుడు, మనము కృంగిపోయి నిరశా నిస్పృహలతో జీవిస్తాము, మన జీవ శక్తిని కోల్పోతాము…బలహీనమై, చీకటి శక్తులకు లొంగి పోతాము.  సాధారణంగా ఇది అహంతో ఉండే వ్యక్తులకు వర్తిస్తుంది..

మీరు ఇతరులను చేసే ప్రతి జడ్జిమెంట్ మీకు మీరు చేసుకున్నట్లే. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం అంటే మీ పరిస్తితులను ప్రేమించటమే అంటే అంగీకరించటమే.

కోపం  వలన జడ్జిమెంట్ …భయం వలన ‘ఆత్మాన్యూనత’ అంటే తప్పు చేసామన్న భావన కలుగుతాయి. నిజానికి ఇవి రెండు కూడా భ్రమే వీటిని మనమే సృష్టిస్తాము.

దీనికి పరిష్కారం క్షమ…. క్షమ….క్షమ (UNCONDITIONAL  FORGIVENESS)

నిజానికి SEPARATION అనేది కుడా భ్రమే …..కాలము, దూరం, ప్రదేశం కుడా భ్రమ మాత్రమె…కాని ఇది వాస్తవంగా అనుభూతి చెందే విధంగా ఇక్కడ సృస్టించబడింది.  అంతె…ఇది నిజమూ కాదు, అబద్దమూ  కాదు, ఇది రెండూ కాదు, ఇది మనస్సు యొక్క ఆట అంతె…….కాబట్టి మీ మనస్సు యొక్క చిన్న చిన్న భాగాలే మీ పరిస్తితులు..బంధాలు …వాటిని ప్రేమతో క్షమించటం ద్వారా అవి మాయమవుతాయి…    ఇదంతా జరగాలంటే ధ్యానం చేయాలి ….గంటలు… గంటలు అప్పుడే సహజంగా మీలో మార్పు వస్తుంది.