Peravaram workshoppleiadian teachings

వ్యాసాలువిశ్వ జ్ఞానం

అదృశ్య ప్రపంచం

అదృశ్య ప్రపంచం

Hari Krishna3 నిమిషాలు

ఈ దృశ్య ప్రపంచం వెనుక దీన్ని నడిపిస్తున్న అదృశ్య ప్రపంచం ఉంది ... ఆ అదృశ్య ప్రపంచం గురించి తెలియనప్పుడు ఈ దృశ్య ప్రపంచాన్నిపరిపూర్ణంగా జీవించలేము ....అప్పుడు మాత్రమే మీకు జన్మలు అవసరమవుతాయి....కానీ ప్రస్తుతం మీరు జన్మలు తీసుకోవాలనుకున్నా అందుకు ఈ గ్రహం సిద్ధంగా లేదు...మీరున్న చైతన్య స్థాయి మించి ఈ గ్రహ చైతన్యం పెరుగుతోంది ....కనుక మీరు తప్పనిసరిగా ఎదగాలి లేదా ఈ గ్రహాన్ని విడిచి వెళ్ళిపోవాలి....ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిందనే విషయం మీకు తెలుసు...కనుక మీ ఎదుగుదలలో భాగంగా మీరు పరిధుల గురించి తెలుసుకోవటం అవసరం...ఇక్కడ పరిధి అంటే ఒక నిర్దిష్టమైన ప్రకంపనా శక్తితోటి ప్రకంపిస్తున్నక్షేత్రం అని చెప్పవచ్చు.... ప్రస్తుతం మీరు నివసిస్తున్నభూమి అనే ఈ గ్రహంలో మీరు చూస్తున్న జీవితం అంతా కూడా మూడవ పరిధి మాత్రమే ...మూడవ పరిధిలో కేవలం పదార్థం మాత్రమే ఉంటుంది. ఈ మూడవ పరిధిలో మీరు జీవిస్తున్నారు అంటే తప్పకుండ నాలుగవ పరిధి గురించి తెలుసుకోవాలి...ఎందుకంటే ఈ మూడవ పరిధి మొత్తం నాలుగవ పరిధి ద్వారా నడిపించబడుతోంది...ఇక్కడ నాలుగవ పరిధి మీకు జాగృత స్థితిలో కనిపించదు కనుక మీరు దానిని గుర్తించలేరు...మీరు నిద్రపోతున్నప్పుడు లేదా మరణించినపుడు నాలుగవ పరిధిలోనే ఉంటారు....కానీ ఆ పరిధి యొక్క జ్ఞానం మీలో లేదు కనుక మెలుకున్నతరువాత అంతా 'కల' అని మరచిపోతారు...ఇక చనిపోయినవాడికి కూడా ఆ జ్ఞానం లేకుండానే చనిపోయాడు కనుక భూమిపైనే ఉన్నాననే భ్రమతోనే జీవిస్తాడు....ఒకవేళ అతను కొన్నాళ్ళకి నాలుగవ పరిధి గురించి తెలుసుకున్నా.. భూమిపై ఉన్నవాళ్ళని కాంటాక్ట్ చేయలేడు..ఒకవేళ నిద్రలో కనిపించి గుర్తు చేసినా, లేచాక వాళ్లకి ఏమి గుర్తు ఉండదు...ఇక నాలుగవ పరిధిలో ప్రధానంగా ఎన్నో రకాల జీవరాసులు ఉంటాయి... వీటి లక్ష్యం భూమిపై ఉన్న జనాభా యొక్క జీవశక్తిని హరించటమే తద్వారా వారిని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా చేసి వారు ఎక్కువగా వ్యసనాలకు, ఫ్యాషన్స్ కి, డబ్బుకి, పరపతికి బానిస అయ్యేలా చేసి వారు అజ్ఞానంతోటే మరణించేలా చేస్తారు....ప్రస్తుతం భూమిపై ఉన్న కష్టాలకి, సమస్యలకి మరియు అనారోగ్యాల అన్నింటికీ మూలం నాలుగవ పరిదే...అందుకె భూమి పైన ఉన్నత ఆత్మలు ఎందరో జన్మలుతీసుకోని నాలుగవపరిధి ప్రభావం మీ మీద పడకుండా ఉండేలా ఎన్నో విషయాలను సంప్రదాయాల పేరుతో చెప్పారు...వీటిలో ప్రధానంగా భ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం...రోజుకి మూడు సార్లు స్నానం చేయటం, దీపారాధన, ఇంటిని శుభ్రపరచి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయటం..ధ్యానం కనీసం రెండుగంటలు చేయటం వగైరా...అన్ని కూడా ఈ నాలుగవ పరిధినుంచి మిమల్నివేరు చేయటానికి మాత్రమే...అప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు పరిపూర్ణంగా జీవించగలుగుతారు.....జీవన్ముక్తిని పొందగలుగుతారు...